Feb 26,2023 20:21

వాల్‌ పోస్టర్‌ను విడుదల చేస్తున్న టి.రమేష్‌ కుమార్‌

పోతుల నాగరాజును గెలిపించండి
- రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి.రమేష్‌ కుమార్‌
- ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం
ప్రజాశక్తి - సంజామల

      పిడిఎఫ్‌ బలపరుస్తున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును గెలిపించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి.రమేష్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌లు పట్టభద్రులను కోరారు. ఆదివారం సంజామలలో పోతుల నాగరాజుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రచారం వాల్‌ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చిలో జరుగు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. శాసనమండలిలో కార్మిక, ఉపాధ్యాయ, అంగన్వాడీల సమస్యలపై గళం విప్పాలంటే పోతుల నాగరాజును గెలిపించాలని కోరారు.
పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించండి
నంద్యాల కలెక్టరేట్‌ : ఉపాధ్యాయ, ఉద్యోగ ప్రజా గొంతుకగా ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిడిఎఫ్‌ అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డికి, పోతుల నాగరాజులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు ఉపాధ్యాయులను కోరారు. నంద్యాల జిల్లా కేంద్రంలో జిల్లాలోని కస్తూరిబా పాఠశాలల ఉపాధ్యాయినీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.నాగరాజు, ఎఐటియుసి జిల్లా నాయకులు బాబా ఫక్రుద్దీన్‌, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలాలిలు మాట్లాడారు. ప్రజా, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యలపై గళమెత్తే నాయకులు కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజులను గెలిపించాలని కోరారు. ఎస్‌టియు నంద్యాల మండల అధ్యక్షులు శ్రీనివాసరావు ,ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.