Nov 03,2023 23:01

పోతుగుంట ఇంటికి మాజీ ప్రధాని కోడలు

పోతుగుంట ఇంటికి మాజీ ప్రధాని కోడలు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : జెడిఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవాగౌడ కోడలు డాక్టర్‌.సౌమ్య దేవాగౌడ శుక్రవారం టిడిపి సీనియర్‌ నేత, మాజీ ట్రస్ట్‌ బోర్డ్‌ చైర్మన్‌ పోతుగుంట గురవయ్య నాయుడు కుమారుడు డాక్టర్‌.పోతుగుంట రాజేష్‌ నాయుడును వారి స్వగహం లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజేష్‌ నాయుడు దంపతులు సౌమ్య దేవగౌడ్‌ కు ముక్కంటి తీర్థప్రసాదాలు, జ్ఞాపికలు, కలంకారీ వస్త్రాలు బహుకరించారు. ప్రముఖ డాక్టర్‌ గా, వ్యాపారవేత్తగా బెంగళూరులో సిరపడ్డ రాజేష్‌ నాయుడు రాజకీయంగా కూడా ఎదగాలని మాజీ ప్రధాని కోడలు సౌమ్య ఆకాంక్షించారు. డాక్టర్‌.రాజేష్‌ సతీమణి చైతన్య ఆది కేశవులు పాల్గొన్నారు.