ప్రజాశక్తి-గుంటూరు : సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2 వంటి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ప్రతిరోజూ అధ్యయనం చేయటం ఎంతో అవసరమని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. స్టూడెంట్ యూని యన్ ఫర్ నేషన్, కెవిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బ్రాడీపేటలోని యుటిఎఫ్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఐఎఎస్ ఫౌండేషన్ క్లాసుల్లో శుక్రవారం లక్ష్మణరావు ప్రసంగించారు. కరెంట్ అఫైర్స్‌ను అంతర్జా తీయ, జాతీయ అంశాలుగా విభజించుకోవాలని చెప్పారు. వివిధ దశల్లో జరుగుతున్న సంఘటనలు, అంతర్జాతీయ సంస్థల గురించి అధ్యయనం చేయాలని చెప్పారు. క్రీడలు, అవార్డులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాతీయ, ఆర్థిక వ్యవస్థ, నియామకాలు, ప్రముఖ వ్యక్తులు మొదలైన అంశాలను గురించి తెలుసుకోవాలని, దీని కోసం నిరంతరం దినపత్రికలను అధ్యయనం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో సాయి, బాలు, అజరు పాల్గొన్నారు.










