Jun 19,2023 00:09

బొర్రా గుహల వద్ద పర్యాటకులు

ప్రజాశక్తి -అనంతగిరి:ప్రముఖ ప్రర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు సందర్శకులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో విదేశీ, ఇతర ప్రాంతాలకు చెందిన వేలాది మంది పర్యాటకుల తాకిడి నెలకొంది. బొర్రా గుహలు తిలకించిన అనంతరం కటికి. తాడిగుడ జలపాతాలు సందర్శించి స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. అనంతగిరి కాఫీ ప్లాంటేషన్‌ మీదుగా అరకు సుంకరమెట్ట యు పాయింట్‌ తిలకించారు. మండుతున్న ఎండలు, వడగాల్పుల కారణంగా పర్యాటకు లేక వెలవెల బోయిన ఈ ప్రాంతాలు ఆదివారం కిటకిటలాడాయి.