Sep 03,2023 00:01

ప్రజాశక్తి - వేటపాలెం 
సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం పోస్టర్ ప్రజెంటేషన్‌పై పోటీలను నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం వేణుగోపాలరావు తెలిపారు. కళాశాల టెక్నికల్ క్లబ్ ఆధ్వర్యములో మానవ జీవితముపై ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ప్రభావం వంటి అంశాలపై విద్యార్థులకు పోస్టర్ ప్రజెంటేషన్ పోటీ నిర్వహించినట్ల తెలిపారు. పోస్టర్ ప్రజెంటేషన్ ద్వారా సంక్లిష్టమైన సాంకేతిక అంశాలను సామాన్య మానవునికి సులువుగా అర్ధమయ్యే రీతిలో వివరించవచ్చని తెలిపారు. విద్యార్థులు వివిధ రంగాలలో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు కనుగొనే దిశలో శక్తియుక్తులను ప్రదర్శించడానికి ఇది ఒక మంచి అవకాశమని తెలిపారు. పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలో 53టీములు పాల్గొన్నట్లు తెలిపారు. పోస్టర్ ప్రజెంటేన్ పోటీలకు జి శ్రీనివాసరావు, డి శివబాస్కర్‌ కన్వినర్లుగా వ్యవహరించారు.