
మర్యాదపూర్వకంగా కలిసిన యూనియన్ నాయకులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: పోస్టల్ సూపరింటెండెంట్‌గా పి.శ్రావణ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన్ను నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న నెట్‌వర్క్ సమస్యలు, కాలం చెల్లిన కంప్యూటర్లు, ప్రింటర్లను మార్చాలని ఆయన్ను కోరారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన్ను కలిసిన వారిలో సంఘ జిల్లా నాయకులు యు.వి రమణ, గణపతి, వెంకటేష్, నందికేశ్వరరావు, పాత్రో, చంద్రమోహన్ తదితరులున్నారు.