పోరుమామిళ్ల టౌన్ : పట్టణంలోని సబ్ పోస్టాపీసు పరిధిలోని అన్ని బ్రాంచి పోస్టు మాస్టర్లు, ఇడి పేకర్స్ పోస్టాపీసు దగ్గర బుధవారం సమ్మెకు దిగారు. ఆలిండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్, నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్స్ పిలుపు మేరకు ఒక్కరోజు సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా పోస్టల్ యూనియన్ నాయకులు నారాయణరెడ్డి, ప్రకాశం, కొండలరావు, గురప్ప మాట్లాడుతూ కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు వెంటనే అమలు చేయాలన్నారు. 8 గంటలపని, పెన్షన్‌తో సహా అన్ని ప్రయోజనాలను మంజూరు చేయాలన్నారు. సీనియర్ జిడిఎస్ ఉద్యోగులకు 12, 24, 36 సంవత్సరాల సర్వీసుకు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేసి ఆర్థిక ఉన్నతి కల్పించాలన్నారు. గ్రూప్ ఇన్సూరెన్స్ 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ రూ.5 లక్షలకు పెంచాలని, పెయిడ్ లీవ్‌ను 180 రోజుల వరకు దాచుకొని నగదుగా మార్చుకొనే సౌకర్యం కల్పించాలని, జిడిఎస్ వారి కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలని, ఎస్‌డిబిఎస్‌కు జిడిఎస్ కాంట్రిబ్యుషన్ 10 శాతం డిపార్ట్మెంట్ 10 శాతం కాంట్రిబ్యుషన్ ఇవ్వాలని పేర్కొన్నారు. తాత్కాలిక పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిపిఎంలు ఇందిరా ప్రియదర్శిని, సుబ్బారెడ్డి, కొండలరావు, గుర్రప్ప, ప్రసాద్, శివమ్మ, సుభాషిణి, నితీష్, ప్రసాద్, రమేష్, దస్తగిరి, రామిరెడ్డి, సుబ్బారావు పాల్గొన్నారు.










