ప్రజాశక్తి-కొల్లూరు
కొల్లూరు మండలం పరిధిలోని క్రాప పోస్ట్ ఆఫీస్ లో గల్లంతయిన డబ్బులు వెంటనే ఖాతాదారులకు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొల్లూరు హెడ్ పోస్ట్ ఆఫీస్ గేట్లు మూసివేసి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల సిపిఎం నాయకులు బొనిగల సుబ్బారావు మాట్లాడుతూ గతంలో తెలిపిన విధంగా క్రాప గ్రామం పోస్ట్ ఆఫీస్‌లో రూ.30లక్షలు తీసుకొన్న శరత్ అనే అతను పరారయ్యాడని తెలిపారు. ఆందోళన సందర్భంగా ఈనెల 31నాటికి ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అనుకున్న సమయానికి డబ్బులు ఇవ్వకపోవడంతో బుధవారం లబ్ధిదారులు కొల్లూరు హెడ్ పోస్ట్ ఆఫీస్ తాళాలు వేసి ఆందోళన చేశారు. దీంతో ఉన్నతాధికారులు సాయంత్రం 4గంటలకు వచ్చి లబ్ధిదారులతో మాట్లాడి మొత్తం 102 మంది ఉన్నారని, ఇప్పుడు 42 మందికి ఎకౌంట్లో డబ్బులు ఏడు రోజుల్లో వేస్తామని, మిగిలిన అమౌంట్ ఈనెల 20న పూర్తి అమౌంట్ ఇస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. సమయానికి ఇవ్వకపోతే మరల హెడ్ పోస్ట్ ఆఫీస్ తాళాలు వేసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు సిపిఎం మండల కార్యదర్శి తోడేటి సురేష్ గ్రామస్తులు సాంబ కోటేశ్వరరావు రేఖ తిరుపతమ్మ ప్రశాంతి గోపి తదితరులు పాల్గొన్నారు










