ప్రజాశక్తి - పంగులూరు
పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని బైటమంజులూరు సర్పంచి చక్రవరం రుక్మిణి తిరుమల రాజు అన్నారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు శుక్రవారం నిర్వహించారు. తల్లులకు టిహెచ్ఆర్‌ను పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు, బాలింతలకు మంచి పోషకాహారం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. దీనిని ఉపయోగించుకొని గర్భవతులు, బాలింతలు ఆరోగ్యవంతులుగా ఉండి పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరారు. గర్భిణీలు, బాలింతలకు కిట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ జి సుజాత, హెల్పర్ ఎస్ అనంతలక్ష్మి, మహిళా కానిస్టేబుల్ డి రాధమ్మ, గ్రామ పెద్ద సిహెచ్ సుబ్బరాజు పాల్గొన్నారు.










