Mar 24,2023 00:04

మాట్లాడుతున్న ఎంపిడిఒ

ప్రజాశక్తి-నక్కపల్లి:స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద గురువారం పౌష్టికాహార పక్షోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ రత్నం, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, ఎంపీడీవో సీతారామరాజు ప్రారంభించారు. ముందుగా పౌష్టికాహారానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, చిరుధాన్యాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.గర్భిణీలు, బాలింతలు, పిల్లల్లో రక్తహీనత లోపించకుండా తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా సకాలంలో అందిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. వచ్చే నెల మూడో తేదీ వరకు అన్ని అంగన్వాడి కేంద్రాల్లోనూ పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు వెలగా ఈశ్వరరావు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
కోటవురట్ల:చిన్నారులకు పోషకాహారాన్ని అందించాలని ఎంపీడీవో చంద్రశేఖర్‌ తెలిపారు. గురువారం ఆయన ఎండపల్లి గ్రామంలో అంగన్వాడీ సిబ్బందితో ఏర్పాటు చేసిన పోషక పక్వాడ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక సర్పంచి పావని ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆహారాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పౌష్టికాహారాన్ని చిన్నారులకు పరిశుభ్రంగా అందజేయాలన్నారు.