తాడేపల్లి రూరల్: పోషకాహారం తీసుకోవటం వలన ఆరోగ్యం పదిలంగా ఉంటుందని కెఎల్ విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయం ఎం. హెచ్.ఎస్.డీన్ డాక్టర్ ఎం.కిషోర్ బాబు అన్నారు. శుక్రవారం కెఎల్ విశ్వవిద్యా లయం ఎంబిఎ విభాగంలో ఎన్ ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ ఆర్యోగ్య దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయి ఆయన మాట్లాడుతూ నేటితరం యువత కంప్యూటర్, మొబైల్, టీవీ తెర లకు పరిమితమై పోయారని అన్నారు. దీంతో వ్యాయామం లేక కొంత మంది యువత యుక్త వయస్సులోనే ఊబ కాయం, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నారని ఆంధోళన వ్యక్తం చేశారు. కెఎల్‌యు వైద్యాధికారి డాక్టర్ బి. విద్యాసాగర్ మాట్లాడుతూ జంక్ ఫుడ్ కు అలవాటుపడి అనారోగ్యం కొనితెచ్చు కుంటున్నారని, పండ్లు, కాయకూరలు, చిరుధాన్యాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు చిరు ధాన్యాలు, మొలకలను పంపిణీ చేశారు. కెఎల్ విశ్వవిద్యాలయ వైద్యాధికారి డాక్టర్ బి. విద్యాసాగర్‌ను ఎంబిఎ విభాగపు అధ్యా పకులు ఘనంగా సత్కరించారు.కార్య క్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కెవివివి.రాజు ,విశ్వవిద్యా లయం వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ జి.పార్ధ సారధివర్మ, ప్రోవైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ఎన్.వెంకట్రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బా రావు, విద్యార్ధి విభాగపు సంక్షేమ అధికారి డాక్టర్ చప్పిడి హనుమంతరావు, ఎంబిఎ విభాగాధిపతి డాక్టర్ కె. హేమ దివ్య పాల్గొన్నారు.
మంగళగిరి: ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందు తుందని ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ఎం.వంశీకృష్ణ అన్నారు. స్థానిక ఎస్‌ఎల్‌ఎం చైతన్య హై స్కూల్ లో ప్రజా ఆరోగ్య వేదిక మంగళగిరి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజాఆరోగ్యంపై అవగాహన సదస్సు జరి గింది. వంశీకృష్ణ మాట్లాడుతూ పిల్లలకు జంక్ ఫుడ్ ఇవ్వొద్దని, పోషక విలువలు ఉన్న ఆహారం, పాలు, పండ్లు, నట్స్, పీచు వంటి ఆహార పదార్థాలను పిల్లలకు అం దించాలని కోరారు. పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ సంద ర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి, విజేతలకు బహు మతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య వేదిక డివిజన్ కార్యదర్శి ఎ.జయరాజు, హై స్కూల్ ప్రిన్సిపల్ ఎస్. కృష్ణ ప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య వేదిక సహాయ కార్యదర్శి ఎం.నాగేశ్వరావు, ఎస్ చందు తదితరులు పాల్గొన్నారు.










