ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్ : రాష్ట్రీయ పోషణ మాV్‌ా ఈనెల 30 వరకు నిర్వహించనున్నట్టు ఐసిడిఎస్ పిడి కె విజయగౌరి తెలిపారు. రాష్ట్రీయ పోషణ మాV్‌ా కార్యక్రమాన్ని మండలంలోని నర్సిపురం అంగన్వాడి కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. గర్భిణులు, శిశువులు, బాలలు, కిశోర బాలికలు తదితర వర్గాలపై ప్రత్యేక దష్టి సారిస్తూ కార్యక్రమం చేపట్టడం జరుగుతోందన్నారు. ''సుపోషిత్ భారత్, సాక్షర భారత్, సశక్త భారత్'' శీర్షికన రాష్ట్రీయ పోషణ మాV్‌ా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శిశువులకు తల్లి పాలు, అదనపు ఆహారం అందించడం, పౌష్ఠికాహారం పెంపొందించడం, రక్త హీనత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. పౌష్ఠికాహారం తయారీ విధానం, చిరు ధాన్యాలు వినియోగం, ఉపయోగాలు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. రక్త హీనత పరిస్థితులు తెలుసుకొనుటకు చిన్నారులకు, గర్భిణీలకు, పునరుత్పత్తి దశలో ఉన్న మహిళల వివరాలు తెలుసుకొనుటకు మురికివాడలు, ఇతర ప్రాంతాలలో శిబిరాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సాలూరు : ఈ నెలాఖరు వరకు పోషణ మహా మహౌత్సవాలపై అవగాహన కల్పిస్తూ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని పట్టణ అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఒ బి.సత్యవతి ఆధ్వర్యాన అంగన్వాడీ కార్యకర్తలు గుమడాం నుంచి పెద హరిజనపేట వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిడిపిఒ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎసిడిపిఒ మంగతాయారు, సూపర్ వైజర్లు రవణమ్మ, భారతి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు బి.రాధ పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని గుచ్చిమిలో ప్రోషక మహౌత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ సుగుణ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అంగన్వాడీ కార్యకర్తలు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : పౌష్టికాహారం తో ఆరోగ్యవంతమైన జీవితం ఉంటుందని, గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలని భద్రగిరి ఐసిడిఎస్ సిడిపిఒ సిహెచ్ సుశీల దేవి కోరారు. పౌష్టికాహార మాసోత్సవాలు సందర్భంగా గుమ్మలక్ష్మీపురంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రగిరి ప్రాజెక్టు పరిధిలో ఉన్న గుమ్మలక్ష్మీపురం, తాడికొండ, రేగిడి, దుడ్డుఖల్లు, కేదారి పురం సెక్టార్ల అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన పౌష్టికాహార పదార్ధాలను ప్రదర్శనగా ఉంచారు. వీటిలో గుమ్మ లక్ష్మీపురం సెక్టార్ సభ్యులు తయారుచేసిన పౌష్టికాహారానికి మొదటి బహుమతి వచ్చింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
వీరఘట్టం: గర్భిణీ సమయంలో ఎక్కువగా పోషకాహారం తీసుకుంటే తల్లులతో పాటు పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారని స్థానిక సిడిపిఓ బి షిమ్మలమ్మ గర్భిణీలకు సూచించారు. మండల కేంద్రంలోని ఒకటి, రెండు సెక్టార్ పరిధిలో నిర్వహించిన పోషక ఆహార వారోత్సవ కార్యక్రమంలోమాట్లాడారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు ఎన్.రాజేశ్వరి, జె.జ్ఞానమ్మ, అంగన్వాడి కార్యకర్తలు, గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు.










