Sep 14,2023 18:58

కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణులు

ప్రజాశక్తి - పొదలకూరు :మండలంలోని డేగపూడిలో అంగన్‌వాడీ సెంటర్‌లో గురువారం పోషణ్‌ మాసోత్సవాలను నిర్వహించారు. అంగన్‌వాడీ సూపర్‌ వైజర్‌ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లల తల్లులు ఈ మాసోత్సవాల్లో పాల్గొన్నారు. అంగన్‌వాడీ సూపర్‌ వైజర్‌ ఎం .జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ పోషక విలువలు ఉండే ఆహారం గురించి వివరించారు. రాగులు, జొన్నలు, సజ్జలు వేరుశనగ చిక్కిలు ఆకుకూరలు ,పాలు పండ్లు మొదలైన వాటి యొక్క ప్రాధాన్యతను వారికి వివరించారు. ఉమెన్‌ పోలీస్‌ ఎస్‌కె చాందిని అంగన్‌వాడీ కార్యకర్తలు మీనమ్మ, పెంచల లక్ష్మి లావణ్య ఉన్నారు.