ప్రజాశక్తి - యద్దనపూడి
మండలంలోని జాగర్లమూడి గ్రామంలో పోషకాహార మాసోత్సవాలలో భాగంగా ఐడిఎస్ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎఎస్ ఉన్నత పాఠశాల నందు మానవ హారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ సుజాత మాట్లాడుతూ పిల్లలకు పోషక ఆహారం అందించాలని అన్నారు. విద్యార్ధులతో పోషకాహార నినాదాలు చేయించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం బెల్లం శ్రీనివాసరావు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.










