Sep 24,2023 01:39

ప్రజాశక్తి - చీరాల
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టిక ఆహారం తీసుకోవడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని కౌన్సిలర్ సూరగాని లక్ష్మి అన్నారు. పేరాల 5వ వార్డు కరణంవారి వీధి, గోలివారి వీధి అంగనవాడి కేంద్రంలో పోషకాహర మాసోత్సవంలో నిర్వహించారు. ఐటిసి బంగారు భవిష్యత్తు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా పీడీ కె ఉమా, ఐటిసి మేనేజర్ విజయలక్ష్మి మాట్లాడారు. రెడ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 8రకాల ఉడెన్ మెటీరియల్‌ను అంగన్వాడీ కార్యకర్తలుకు అందజెశారు. కార్యక్రమంలో సూపర్వైజర్ విపిజి తబిత, ఐటిసి ప్రతినిధులు సురేష్, రేవతి, త్రివాణి, పుష్పలత, సుప్రియ, కె అనిత, అంగన్వాడీ కార్యకర్తలు ఆర్ నాగలక్ష్మి, ఎన్ మాధవి పాల్గొన్నారు.