Sep 09,2023 01:22

ప్రజాశక్తి - చీరాల
ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టిక ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారని మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు కోడూరు నాగజ్యోతి అన్నారు. పట్టణంలోని ప్రకాష్ నగర్ 25వ వార్డు అంగనవాడి కేంద్రంలో పౌష్టిక ఆహారంపై వార్డు ప్రజలకు అవగాహన కల్పిస్తూ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సెక్టార్ సూపర్వైజర్ బి కుమద్ వతి గర్భవతులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత వివరించారు. పౌష్టికాహారం బిడ్డలకు ఇవ్వాలన్నారు. గర్భవంతులు సకాలంలో మంచి ఆహారం తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో కె తిరుమలదేవి, ఆశా వర్కర్లు పి పద్మ, ఎస్‌కె ఖరీమును, కె తులసి, అంగన్వాడీ కార్యకర్తలు టి వనజకుమారి, ఎం సుజాత, పి యేసుదేవి, డి శివ నాగమ్మ కె రేవతి పాల్గొన్నారు.