ప్రజాశక్తి - కుక్కునూరు
పోలవరం పోరుకేక పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేసిన రెడ్‌షర్ట్ వాలంటీర్లకు అభినందన సభ ఆదివారం కారం వెంకట్రావు అధ్యక్షతన వసంతవాడ సుందరయ్య నగర్‌లో ఆదివారం నిర్వహించారు. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పోలవరం పోరుకేక మహా పాదయాత్ర గతనెల 26 తేదీన మండలంలో రుద్రంకోటకు చేరుకుంది. 15 రోజులపాటు పోలవరం పోరుకేక పాదయాత్ర నెల్లిపాక నుండి విజయవాడ వరకూ జరిగింది. ఈ పాదయాత్రలో వేలేరుపాడు మండలం నుండి పాల్గొన్న 15 మంది వాలంటీర్లకు సిపిఎం జిల్లా నాయకులు మడివి దుర్గారావు, మండల కార్యదర్శి ధర్ముల, రమేష్ కొత్త, వెంకటేశ్వర్లు, మడకం, అక్కమ్మ ద్వారా వాలంటీర్లకు మెమెంటోలు అందజేశారు. పోరుకేక పాదయాత్రలో అనేక సమస్యలు బృందానికి ప్రజలు విన్నవించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ గ్రామ గ్రామాన నిర్వాసితులు పాదయాత్ర బృందానికి నీరాజనాలు పలికారని పాదయాత్రలో పాల్గొన్న వాలంటీర్ల ద్వారా వారి అభిప్రాయాన్ని సభలో వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధర్ముల రమేష్ మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలపై చేపట్టిన యాత్రలో పాల్గొన్న వారిలో ఎక్కవమంది యువతే అని గుర్తు చేశారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రభుత్వాలు కట్ అఫ్ డేట్‌లు పెట్టి 18 సంవత్సరాలు నిండిన వారిని ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ నుండి దూరం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గ్రామాల నుంచి తరలించే నాటికి వయస్సును పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మడకం ఏసుబాబు, కె.ప్రకాష్, పూసం రాంబాబు, పాయం సత్యం, కుంజ కావ్య, భవాని, మౌనిక, జ్యోతి, నాగేంద్రబాబు, నాగు, బాలరాజు పాల్గొన్నారు.










