జిల్లాలో కార్మికుల శంఖా రావం మోగుతోంది. ఆప్కాస్ ఉద్యో గుల ను రెగ్యులర్ చేయాలని కోరుతూ సిఐ టియు ఆధ్వర్యంలో ఉద్యమం ఊపందు కుంది. 2014 జూన్ రెండవ తేదీ నాటికి ఐదేళ్లు నిండిన కాంట్రాక్టు ఉద్యో గులను రెగ్యులర్ చేస్తామనడం సమంజసం. హర్షణీయమే. ఇటువంటి తరహాలోనే ఆప్కాస్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనే న్యాయమైన డిమాండ్ పట్ల ఎందుకు స్పందిం చడం లేదో పాలకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంరక్షణకు ఆప్కాస్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవ సరం ఉంది. కార్పొరేషన్ ఏర్పాటు చేశామనే పేరుతో ఆప్కాస్‌లోని ఉద్యోగుల ప్రయోజనాల్ని విస్మరించడం బాధాకరం. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆరు రోజులుగా జిల్లా కేంద్రంలోని జిజిహెచ్ ఎదుట ఆప్కాస్ ఉద్యోగులు వినూత్న రీతుల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్న తీరు అపూర్వం. అభినందనీయం. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసిన తరహాలోనే ఇక్కడా చేయాలనే న్యాయమైన డిమాండ్‌ను పాలకులు ఆలకించాల్సి ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో అడిగిన వారికి అడిగిన చందంగా వాగ్దానాలు చేసిన పాలకులు, గద్దెనెక్కిన తర్వాత మరి చిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 98 శాతం హామీలను నెరవే ర్చామని చెప్పుకుంటున్న పాలకులు ఆప్కాస్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదో సమాధానం చెప్పాల్సి ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలు తరుముతున్న నేపథ్యంలో కార్మిక నాయకత్వం ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి. పోరాటాల ద్వారానే ఫలితాలు ఉంటాయనే చారిత్రక సత్యాల్ని పోరాటకారులు గమనంలో ఉంచుకోవాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒకలా, ఆప్కాస్ ఉద్యోగులకు మరోలా చూడడం వివక్షను చూపించడమే అవుతుంది. ఇటువంటి వివక్ష, బానిసత్వాలకు వ్యతిరేకంగా ఆదిమ యుగం నుంచి ఆధునిక డిజిటల్ యుగం రూపు దాల్చే వరకు పోరాటమే ఇరుసుగా నడకసాగిందనే సత్యాన్ని కార్మిక శ్రేణులకు నూరిపోయాలి. ఇటువంటి సజీవ సత్యాలే ఉద్యమాల్ని మరింత ఉవ్వెత్తిన ఎగిసి పడేలా చేస్తాయని చెప్పవచ్చు.లేనిపక్షంలో భవిష్యత్ తరాలు నష్టపోతా యనే స్ఫృహను కలిగి నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చదువు, పనిసామర్థ్యం అంశాల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులి ద్దరిదీ ఒకేతరహాలో ఉన్నప్పటికీ ఒకరికి ఒకలా, మరొకరి మరోలా చేస్తామనడం నాగరిక సమాజానికి మాయనిమచ్చగా మిగిలిపోనుంది. ఇటువంటి వ్యత్యాసాల్ని, వివక్షల్ని బానిస బతుకులకు విముక్తి పోరాటాల రూపంలోనే అన్వేషించాల్సి ఉందనే సత్యాన్ని అర్థ మయ్యే లా విడమరిచి చెప్పాలి. ఇటువంటి తిరోగమన విధానాల్ని ఐకమ త్యంతో సమర్థవంతంగా తిప్పికొట్టి తీరాల్సిందే. ఇందుకు కార్మిక లోకమంతా ఉవ్వెత్తున ఉమ్మడిగా కదిలితేనే ప్రయోజనం. లేనిపక్షం లో మరో సార్వత్రిక ఎన్నిక వచ్చే వరకు బానిస, వివక్షలనే సంకెళ్ల లోనే మగ్గిపోవాల్సి వస్తోందనే సత్యాన్ని గమనంలో ఉంచుకోవాలి. పోరాడితేపోయేవి బానిస సంకెళ్లు తప్పా మరేమీ లేదనే సత్యాన్ని పోరాట నాయకత్వం ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.
- ప్రజాశక్తి - కడప ప్రతినిధి










