Mar 19,2023 23:51
నివాళి అర్పిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

ప్రజాశక్తి-మేదరమెట్ల: సిపిఎం పార్టీ దిగ్గజం, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌, వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం వర్థంతి కార్యక్రమాన్ని మేదరమెట్ల పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం ఆంజనేయులు మాట్లాడుతూ నంబూద్రిపాద్‌ జీవిత చరిత్రను, మల్లు స్వరాజ్యం పోరాట పటిమ గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షులు బి దశరథ, కెవిపిఎస్‌ బాధ్యులు కంచర్ల సురేష్‌ బాబు, సిఐటియు బాధ్యులు వీరాంజనేయులు, కౌలు రైతు సంఘం మండల బాధ్యులు చావా కోటేశ్వరరావు, వైకుంఠం, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.