Oct 08,2022 23:22

మహాసభలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు పూనెం సత్యనారాయణ

ప్రజాశక్తి - విఆర్‌.పురం
పోరాటాల ద్వారా కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు పూనెం సత్యనారాయణ, నాయకులు పి.వెంకట్‌ పిలుపునిచ్చారు. కూనవరంలో శనివారం జరిగిన సీఐటీయూ 8వ మండల మహాసభ రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, మిడ్డేమీల్స్‌, వెలుగు యానిమేటర్స్‌ తదితర స్కీమ్‌ వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వారికి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పర్మినెంట్‌ చెయ్యాలని, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సిలిండర్లు దాటితే అదనంగా రూ.500 చెల్లించాలన్న ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంట గ్యాస్‌, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపిందని విమర్శించారు.
సిఐటియు మండల కమిటీ ఎన్నిక
అనంతరం సిఐటియు కూనవరం మండల కమిటీ 21 మందితో ఎన్నికైంది. సిఐటియు మండల అధ్యక్షులుగా తాలూరి శ్రీనివాసరావు, కార్యదర్శిగా కొమరం పెంటయ్య, ఉపాధ్యక్షులుగా అన్నపూర్ణ, మడకం రమేష, ముత్తమ్మ, రాధ, ఏడుకొండలు, అజ్జమ్మ. రాధ, కోశాధికారిగా సుధారాణి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నాగమణి, వెంకమ్మ, శంకర్‌, తెలగాని నాగరాజ్‌, ఈశ్వర్‌, సాయం సత్యనారాయణ, ఆశా, అంగన్వాడీ, మిడ్డేమీల్స్‌, విఒఎ, ఇతర రంగాల నాయకులు పాల్గొన్నారు.
ఐక్య పోరాటాలకు సిద్ధంకండి
ప్రజాశక్తి-రాజవొమ్మంగి
అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా నాయకులు ఎం.వాణిశ్రీ, బి.నిర్మల, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో సిఐటియు మండల 3వ మహాసభ పుట్టా రామరాజు అధ్యక్షతన జరిగింది. ఇందులో పాల్గొన్న వాణిశ్రీ, బి.నిర్మల, లోత రామారావు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కార్మికుల హక్కులు, చట్టాలపై దాడి చేస్తూ, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను సవరించి 4 లేబర్‌ కోడ్స్‌ని తీసుకొచ్చి కార్మికులను యజమానులకు కట్టుబానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
మండల కమిటీ ఎన్నిక
అనంతరం సిఐటియు మండల నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్ష కార్యదర్శులుగా కె.వెంకటలక్ష్మి, పి.రామరాజు, ఉపాధ్యక్షులుగా లక్ష్మిశ్రీ, పి.శ్రీను, సహాయ కార్యదర్శులుగా కె.చంద్రావతి, కె.రాంబాబు, కె.రమణమ్మతో పాటు మరో 14 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, గిరిజన సంఘం నాయకులు కె.సూరిబాబు కె.జగన్నాథం టి.శ్రీను ఇ.సిరిమల్లె రెడ్డి, రాజేష్‌, జిలానీ, అమ్మిరాజు, సిహెచ్‌.కుమారి, కార్మికులు పాల్గొన్నారు.