Jul 21,2023 23:25

మాట్లాడుతున్న డాక్టర్‌ రాజమోహనరావు

పెదనందిపాడు రూరల్‌: గుంటూరు ఛానల్‌ పర్చూరుకు పొడిగింపు పై నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో కార్యదర్శి వై.అంకమ్మ చౌదరి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం పెదనందిపాడులో ఏర్పాటు చేసిన కార్యాచరణ సమావేశంలో పలువురు మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాబై వేల ఎకరాలకు సాగునీరు, 50 గ్రామాలకు తాగునీరు అందించే గుంటూరు ఛానల్‌ పర్చూరువరకు పొడిగింపు పనులు ప్రారంభించేందుకు రైతులు వద్ద సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించే కార్య కమంలో భాగంగా ప్రథమంగా కేవలం 100 కోట్లు నిధులు కేటాయించాలని కోరుతూ 20 రోజుల నుండి గుంటూరు కలెక్టరేట్‌ వద్ద శాంతియుతంగా దీక్షలు చేస్తున్న రైతాంగాన్ని 700 మంది పైగా పోలీసులను కేటాయించి భగం చేయించినంతమాత్రాన పోరాటం ఆపే ప్రసక్తే లేదని అన్నారు. నల్లమడ రైతు సంఘ అధ్యక్షులు డాక్టర్‌ కొల్లా రాజమోహనరావు మాట్లాడుతూ అనేక అబివృద్ధి కార్యక్రమాలకు బటన్‌ నొక్కి డబ్బులు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి కి 50 గ్రా మా ల ప్రజలకు తాగునీరు 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే గుంటూరు ఛానల్‌ పొడిగింపు పనులకు నిధులు కేటాయించి ప్రజలు రైతుల వెతలు తీర్చేందుకు మనసు రాలేదా అని ప్రశ్నించారు బండి నాగేశ్వరావు మాట్లాడుతూ నిధులు మంజూరు విషయంలో జగమొండి జగన్‌ అని, మొండివాడు రాజు కన్నా బలవంతుడు అన్న చందాన ఉందన్నారు పోరాటంలో వెనకడిగేసే ప్రసక్తే లేదన్నారు మన్నవ హరిప్రసాద్‌ మాట్లాడుతూ నిరసన ఉద్యమంలో మహిళ పాత్ర అమోఘమన్నారు సమావేశంలో ముద్దన రాఘవయ్య, ఈదర భ్రమరాంబ. కొల్లా నిర్మల. మువ్వా పెద్దన్న .నర్రా బాలకృష్ణ, అడ్డగడ వెంకటేశ్వర్లు, పోపూరి లక్ష్మీనారాయణ, విశ్రాంత ప్రొఫెసర్‌ విజరు కుమార్‌, బాషా తదితరులు మాటాడారు. పోరాటం అంచలవారీగా ఉధృతం చేస్తేనే విజయం లభిస్తుందని అన్నారు. రైతు సంఘ నాయకులు జాప్యం చేయకుండా వెంటనే అన్ని గ్రామాల్లో పర్యటించి రైతులను చైతన్యపరిచి సుమారు రెండువేల మంది పైగా రైతులతో.. ౖరైతు యాత్ర టు సీఎం' అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. చివరగా సమావేశంలో రైతు సంఘ నాయకులు కొల్లా వీరప్రసాద్‌, రావి శివరామకష్ణయ్య. పోపూరి నాగేశ్వరరావులు గుంటూరు ఛానల్‌ పొడిగింపు పనులకు నిధులు సాధించే పోరా టంలో భాగంగా తాము ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పలు గ్రామాల నుంచి విచ్చేసిన రైతు సంఘాల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.