Sep 11,2022 23:38

మహాసభ వేదికపై నాయకులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు లేబర్‌ యూనియన్‌ (సిఐటియు) ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరాజు పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ కేంటీన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) 11వ మహాసభ ఉక్కునగరంలో సిఐటియు కార్యాలయంలో జరిగింది. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంటీన్‌ కార్మికులందరూ ఒకే యూనియన్‌లో ఉంటూ అనేక హక్కులు సాధించుకున్నారన్నారు. రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంటీన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి బి.కన్నబాబు మూడేళ్లలో జరిగిన పరిణామాలు, చేసిన కార్యక్రమాలు వివరిస్తూ ప్రవేశపెట్టిన కార్యదర్శి నివేదికను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కనీస వేతనం రూ. 26000 ఉండాలనే తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ, కార్మికులంతా ఐక్యంగా పోరాటం చేయడం వల్లనే హక్కులు సాధించుకోగలిగామన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. యూనియన్‌ గౌరవాధ్యక్షులుగా బి.కన్నబాబు, అధ్యక్షులుగా ఎ.శ్రీను, ప్రధాన కార్యదర్శిగా పి.నారాయణరావు, కార్య నిర్వాహక అధ్యక్షునిగా వి.శ్రీను, ఉప ప్రధాన కార్యదర్శిగా కె.సురేష్‌, కోశాధికారిగా కె.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా జి.శ్రీనివాసరావు, డి.పాండే, ఆర్‌.రమణ, కార్యదర్శులుగా గౌరునాయుడు, జిఎ.నాయుడు, ఆర్‌.కృష్ణ, కె.రామారావు, కాంతారావు, ప్రసాద్‌తో పాటు మరో 10మంది కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు లేబర్‌ యూనియన్‌ నాయకులు నమ్మి రమణ, ఆర్‌ రమణ పాల్గొన్నారు.