Oct 12,2023 21:13

ప్రజాశక్తి - కాళ్ల
ఉపాధ్యాయుల సమస్యలను పోరాటాల ద్వారానే పరిష్కరించుకోగలమని ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ అన్నారు. కోపల్లె హైస్కూల్లో యుటిఎఫ్‌ మండల కౌన్సిల్‌ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు బిఆర్‌ఎం.కోటేశ్వరస్వామి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంఎల్‌ఎ షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దు కోసం యుటిఎఫ్‌ రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ పటిష్టతకు, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిది ఒక్క యుటిఎఫ్‌ మాత్రమేనని తెలిపారు. జిల్లా అధ్యక్షులు పిఎస్‌.విజయరామరాజు మాట్లాడుతూ సంఘం పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ స్పందించి హాజరై ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలను సాధించుకోవాలన్నారు. ఎన్నికల అధికారి సిహెచ్‌.పట్టాభిరామయ్య, కె.సాయిరాం ఆధ్వర్యంలో యుటిఎఫ్‌ మండల శాఖ ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. గౌరవాధ్యక్షులుగా కె.సత్యనారాయణ, అధ్యక్షులుగా బి.రాజమౌళి కోటేశ్వరస్వామి, సహాధ్యక్షులుగా పి.ప్రభుదాస్‌, మహిళా సహాధ్యక్షురాలుగా డి.కనకదుర్గ, ప్రధాన కార్యదర్శిగా ఎం.శంకర్రావు, కోశాధికారిగా వివిఆర్‌కె.రవికుమార్‌ రాజు, ఆడిటర్‌గా కెవి.అప్పలరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.