నరసరావుపేట: పోరాటాల ద్వారానే రైతాంగం ఎదుర్కొంటున్న సమ స్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుందని రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు అన్నారు. స్థానిక పల్నాడు విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం మహా ధర్నా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపాల రావు మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 30న విజయవాడలో రైతు సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహించే మహాధర్నాలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేశాయని విమర్శించారు. రైతులకు కావాల్సిన విత్తనం దగ్గర నుండి విక్రయం వరకు తమదే బాధ్యత అంటున్న రైతు భరోసా కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నా యన్నారు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే తొలకరి వర్షాలు కురిసినప్పటికీ విత్తనాలు,ఎరువులు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో లేవని విమర్శించారు. పల్నాడు జిల్లాలో గత మూడేళ్లుగా వరుసగా నకిలీ విత్తనాలతో రైతు నష్ట పోయిన దాఖలాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ శాఖా ధికారులు మొక్కుబడి తనిఖీలతో సరి పెట్టకుండా క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయాలన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్దతు ధరలు తూతూ మంత్రంగా ఉన్నాయే తప్ప, రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా లేవన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై కూడా రాజకీయం చేస్తున్నారన్నా రని మండిపడ్డారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయ కులు గద్దె చలమయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై రాధాకృష్ణ, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, జి.రవిబాబు, జిల్లా కమిటీ సభ్యులు డి.శివకుమారి, జి.మల్లేశ్వరి, బాలకృష్ణ ,పెద్దిరాజు, హనుమంతరెడ్డి, ధరణికోట విమల, గద్దె ఉమ శ్రీ పాల్గొన్నారు.










