ప్రజాశక్తి-కాకినాడ పోరాటాల ద్వారా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వల్లనే రాష్ట్రంలో అతిపెద్ద సంఘంగా యుటిఎఫ్ ఆవిర్భవించిందని ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక యుటిఎఫ్ హోమ్‌లో ఆదివారం ఉద్యమ శిక్షణా తరగతులు యుటిఎఫ్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఐ.ప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. యుటిఎఫ్ సంఘ విశిష్టత అంశంపై ఎంఎల్‌సి ఐవి మాట్లాడారు. ప్రస్తుత దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై ఎల్‌ఐసి నాయకులు సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రైవేటీకరణను ప్రోత్సాహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా పేదరికం వెంటాడుతూనే ఉందన్నారు. అంకెలు, ర్యాంకులు ప్రగతికి సూచిక కాదని, నిజంగా తలసరి ఆదాయం పెరుగడం ద్వారానే ప్రజల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. తెలిపారు. ఈ సంఘ వారసత్వం భవిష్యత్తు తరానికి అందించాలని కోరారు. ఈ శిక్షణ తరగతుల్లో జిల్లా అధ్యక్షుడు నగేష్, ప్రధాన కార్యదర్శి చక్రవర్తి రాష్ట్ర కార్యదర్శి అన్నారాం, సుమారు 80 మంది కార్యకర్తలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










