Sep 10,2022 23:11

నివాళులర్పిస్తున్న రజక సంఘం నేతలు

ప్రజాశక్తి -మధురవాడ : ప్రజా పోరాటాలకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ అని, ఆమె చేసిన సేవలను, పోరాటాలను ఆదర్శంగా తీసుకోవాలని మధురవాడ రజకసంఘం అధ్యక్షుడు నర్వ చంటి అన్నారు. శనివారం ఏడో వార్డు మొగధారమ్మకాలనీ వద్ద మధురవాడ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతిని నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి రజక సంఘ నేతలు నివాళులర్పించారు. ఈ ఈసందర్భంగా చంటి మాట్లాడుతూ ప్రజా పోరాటాల గడ్డ తెలంగాణలో పుట్టి, ఉద్యమించిన ఐలమ్మకు జ్ఞాపకార్థంగా పాలకుర్తిలో సిఇపెం ఆధ్వర్యంలో ప్రజా విరాళాలతో స్మారకస్థూపం, స్మారక భవనాలు, ఐలమ్మ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు అప్పారావు సింహాచలం, కుమార్‌,చందర్రావు పాల్గొన్నారు.

.