పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం
- ఎస్‌డబ్ల్యుఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్ : పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, దానికి నిదర్శనంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కార్మికులు ఉద్యమకారులు పోరాటాలు చేసి వారు హక్కులు సాధించుకున్నారని కార్మికుల హక్కుల సాధన సాధనకు నిరంతరం పోరాటాలు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య అన్నారు. ఆదివారం స్థానిక డాక్టర్ జెట్టి శేషారెడ్డి ఆడిటోరియంలో ఎస్‌డబ్ల్యుఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ఎన్ రాజశేఖర్ అధ్యక్షతన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. జిఒ నెంబర్ 70 కాంట్రాక్టర్ రెగ్యులేషన్ కోసం జిఒ నెంబర్ 71 సిసిఎ రెగ్యులేషన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఇందులోనే అనేక క్లాసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఇవి ఆర్‌టిసి ఉద్యోగులు తిమ్మిన దగ్గర శిక్షకు సిద్ధంకండి అనే విధంగా ఉన్నాయన్నారు. ఈ రెగ్యులేషన్స్‌తో రెగ్యులేషన్స్‌లోని రాజ్యాంగ వ్యతిరేక అంశాలను తొలగించాలని ఎపిఎస్‌ఆర్‌టిసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కులను ట్రేడ్ యూనియన్ నిర్వహణ హక్కులను సమస్యలపై చిన్నపాటి ఆందోళన చేసిన వాటిని కూడా దుష్ప్రవర్తన కింద చూపుతూ రెగ్యులేషన్స్ రూపొందించడం, ప్రభుత్వ యాజమాన్య కార్మిక వ్యతిరేక చర్యల్లో భాగమేనన్నారు. ఆర్‌టిసిలో ఉన్న 1963 కాంటాక్ట్ రెగ్యులేషన్స్‌లోని రాజ్యాంగ వ్యతిరేక ఉద్యోగ కార్మిక వ్యతిరేక అంశాలను హైకోర్టులో నాడు ఎస్‌డబ్ల్యుఎఫ్ సవాల్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డబ్బులిచ్చి పెన్షన్ కొనాలి అనే విధానానికి ఎస్‌డిఎఫ్ వ్యతిరేకమన్నారు. ఓడి పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం నిర్ణయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్‌టిసి కార్మిక ఉద్యోగులలో కులమతాలు ఇచ్చి పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. నెల్లూరు డిపో రూ.14 కోట్ల ఆదాయంలో ఉందని ఆయన గుర్తు చేశారు. ఆర్‌టిసి ప్రభుత్వంలో విలీనం ఆయన తర్వాత డిపో మేనేజర్లు సూపర్ హీరోలుగా మారారని కార్మికులపై పెత్తనం చేస్తున్నారని తెలిపారు. ఈ ధోరణిని మార్చుకోకపోతే ఎస్‌బిఐ ఆధ్వర్యంలో ఉద్యమించక తప్పదని ఆయన హెచ్చరించారు. వన్ బై 2019 రద్దుపై అన్ని కార్మిక సంఘాలతో సదస్సులు నిర్వహించాలని ఆయన కోరారు. న్యూ జనరేషన్ కమ్యూనిజంపై మొగ్గు చూపుతుందని, ఇది శుభపరిణామమని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్‌డి అభ్యర్థిగా గౌరవ అధ్యక్షులు ఎస్‌కె జిలాని బాషా, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కే సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కృష్ణారావు, జిల్లా కార్యదర్శి ఏ కృష్ణయ్య, జోనల్ కార్యదర్శి ఎస్‌కె ఖాజావలీ, మహిళా కన్వీనింగ్ కమిటీ గౌరవ అధ్యక్షురాలు బి.భారతి, జిల్లాలోని అన్ని డిపోల ఎస్‌బిఐ నాయకులు సభ్యులు పాల్గొన్నారు.
ఫొటో : మాట్లాడుతున్న ఎస్‌డబ్ల్యుఎఫ్ నాయకులు










