Oct 14,2022 22:46

సమావేశంలో మాట్లాడుతున్న సంఘం జిల్లా అధ్యక్షులు ప్రసాదరావు

ప్రజాశక్తి -భీమునిపట్నం: పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోగలమని ప్రభుత్వ పింఛనుదారుల సంఘం జిల్లా అధ్యక్షులు డిడి ప్రసాదరావు స్పష్టం చేశారు. శుక్రవారం భీమిలిలో భీమిలి తాలూకా యూనిట్‌ అధ్యక్షులు టి.భీమారావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారుల సంఘం యూనిట్‌ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, గతంలో ఎప్పుడూ లేనివిధంగా పెన్షనర్లకు నెలవారీ పింఛను చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. జివిఎంసి పరిధిలో 18 వేలమంది పెన్షనర్లలో 17వేలమందికి మాత్రమే ఈనెల 7న పింఛను వచ్చిందన్నారు. నెలవారి పింఛనుకోసం రోడ్డెక్కె పరిస్థితులు అనివార్యం కావడం దారుణమన్నారు. సంఘం జిల్లా కోశాధికారి డి ఎస్‌ఎన్‌ మూర్తి, సంయుక్త కార్యదర్షులు టివి రమణమూర్తి, ఎల్‌ విశ్వేశ్వరరావు, బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
సంఘం భీమిలి తాలూకా యూనిట్‌ అధ్యక్షులుగా టి.భీమారావు, కార్యదర్శిగా ఎం.ఆనందరావు, కోశాధికారిగా పి రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా కె సత్యనారాయణ, పి జానకేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.