Nov 14,2023 23:41

వాసుదేవ ఆచార్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న విజరుకుమార్‌ తదితరులు

ప్రజాశక్తి-సత్తెనపల్లి : నిరంతర పోరాట యోధుడు, సిపిఎం సీనియర్‌ పార్లమెంటేరియన్‌ వాసుదేవా ఆచార్య అని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ అన్నారు. స్థానిక పుతుంబాక భవన్‌లో వాసుదేవ ఆచార్య సంతాప సభ మంగళవారం నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సభకు సిపిఎం మండల కార్యదర్శి పి.మహేష్‌ అధ్యక్షత వహించగా విజయకుమార్‌ మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌ సిపిఎం ఉద్యమ నిర్మాతల్లో వాసుదేవ్‌ ఒకరిని, ఆయన సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యులుగాను, కేంద్ర కమిటీ సభ్యులుగాను, సిపిఎం కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌గా, సిఐటియు నేతగా వివిధ బాధ్యతలను నిర్వర్తించారని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో సిపిఎం ఉద్యమం అనేక వడిదుడుకులను ఎదుర్కొంటున్న కాలంలో ఆయన పార్టీని ముందుకు నడిపించడంలో కీలకమైన పాత్రను పోషించారన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన చూపిన బాటలో అందరం పయనిద్దామని చెప్పారు. సభలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, నాయకులు జి.ఉమశ్రీ, ఇ.అరుణ, ఎ.వీరబ్రహ్మం, ఎ.వెంకట్‌నారాయణ, ఎం.జగన్నాథరావు, ఇ.లింగయ్య, కె.జగన్‌, జె.రాజకుమార్‌, ఎం.నరసింహారావు, కవిత, శిరీష పాల్గొన్నారు.