ప్రజాశక్తి- కూనవరం
జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ కొమరం లకీëనారాయణ అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు అన్నారు. లకీëనారాయణ 12వ వర్థంతి కార్యక్రమంలో మండలంలో అభిచర్ల గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. లకీëనారాయణ చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు శ్యామల కృష్ణ పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైస్ ఎంపిపి కొమరం పెంటయ్య అధ్యక్షతన జరిగిన సభలో నాగేశ్వరరావు మాట్లాడుతూ కామ్రేడ్ లకీëనారాయణ మన మధ్య లేక పోయినా, ఫారెస్ట్ అధికారులు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలు స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు. నేటి ప్రభుత్వాలు గిరిజన చట్టాల సవరణకు పూనుకుంటున్నాయని, దానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు లకీëనారాయణ లాంటి పోరాట పటిమ కలిగి ఉండి అటవీ హక్కుల చట్టాల రక్షణకు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతా రామయ్య, నాయకులు పాయం జ్యోతి, వెంకటేశ్వర్లు, మడకం నాగమణి, బాబురావు, మాజీ సర్పంచ్ రవ్వ ప్రసాద్, లకీëనారాయణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.










