- కుదిరిన 'రాజ్యలక్ష్మి పోల్స్' వేతన ఒప్పందం
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ కార్మికులు పోరాడి విజయం సాధించారు. పొందూరు మండలం రాపాక వద్ద్ద గల శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ కార్మికులకు, యాజమాన్యానికి మధ్య నగరంలోని ఒక హోటల్‌లో శనివారం వేతన ఒప్పందంపై చర్చలు జరిగాయి. కార్మికులకు తాము అండగా నిలుస్తున్నట్టు తెలిపారు. ఈ చర్చలలో యాజమాన్య ప్రతినిధి పి.రాజశేఖర్, శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కర్నేని గోవిందరావు, పి.అప్పలనాయుడు నాయుకులు సిహెచ్.కోదండరావు, ఇ.రాము తదితరులు పాల్గొన్నారు. పోరాట ఫలితంగా విజయం సాధించిన రాజ్యలక్ష్మి పోల్స్ కార్మికులకు సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్.అమ్మన్నాయుడు, జిల్లా కార్యదర్శి ఎన్.వి రమణ అభినందనలు తెలిపారు.










