జెండాను ఎగరేస్తున్న కార్మిక సంఘాల నాయకులు
పోరాడి హక్కులను సాధించుకోవాలి
ప్రజాశక్తి పగిడ్యాల
పోరాడి కార్మికుల హక్కులను సాధించుకోవాలని కార్మిక సంఘం నాయకులు రఘురాంమూర్తి అన్నారు. బుధవారం మండల కేంద్రం పగిడ్యాల బస్టాండ్ లో 137 వ మే డే సందర్భంగా వారు కార్మిక జెండాను ఎగిరేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల మోసం చేస్తున్నాయని విమర్శించారు. ప్రతి కార్మికుడు మహా హక్కులకై పోరాటాలు సాగించినప్పుడే ప్రభుత్వాలు దిగివస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చాంద్ బాషా, అబ్దుల్ రెహమాన్, ఇబ్రహీం, శ్రీను, రఫీ, మస్తాన్ వారి, అబ్దుల్ మజీద్ తదితరులు పాల్గొన్నారు.










