ప్రజాశక్తి - చెరుకుపల్లి
గ్రామంలో నూతనంగా పుననిర్మించిన డాక్టర్ వైఎస్‌ఆర్ విగ్రహాన్ని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఆవిష్కరించారు. గ్రామంలో గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మండల పరిషత్ ఉపాధ్యక్షులు పైనం రంగారెడ్డి, వైసిపి మండల కన్వీనర్ పైనం ఏడుకొండలరెడ్డి ఆధ్వర్యంలో మొదటి రోజు జరిగిన కార్యక్రమంలో నూతనంగా పునః నిర్మించిన డాక్టర్ వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం గ్రామంలో పర్యటించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించేందుకు చక్కటి అవకాశం అని మోపిదేవి అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పైనం బసవ పున్నమ్మ, మాజీ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ ఈవూరి ఏడుకొండలు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.










