Dec 15,2022 00:12

మాట్లాడుతున్న సిపిఎం మండల కార్యదర్శి సీతారామయ్య

సిపిఎం మండల కార్యదర్శి సీతారామయ్య
ప్రజాశక్తి-విఆర్‌.పురం

పోలవరం ప్రాజెక్టు, నిర్వాసితుల విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిజ స్వరూపం బట్టబయలైందని సిపిఎం కూనవరం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య అన్నారు. కూనవరం సిపిఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో సీతారామయ్య మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్‌ ఇప్పట్లో పూర్తి కాదని కేంద్ర మంత్రి మాట్లాడేతే రాష్ట్రంలో వైసిపి ఎంపీలుగాని, ముఖ్యమంత్రి, జగన్‌ గాని నోరు మొదక పోవడం దుర్మార్గమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఇవ్వడం కుదరదని కేంద్రం పార్లమెంట్‌లో నిస్సిగ్గుగా ప్రకటించినా వైసిపి, టిడిపి ఎంపీలు ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం రాష్ట్రం పట్ల ఆ పార్టీల వైఖరిని నిదర్శనమని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వసితులకు న్యాయం చేసే వరకు సిపిఎం పోరాడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాయం సత్యనారాయణ, తాళుం శ్రీనివాసరావు, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.