Jun 27,2023 00:27

న‌ర‌స‌రావుపేట‌లో విరాళాల సేక‌ర‌ణ‌లో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా విలేకర్లు : ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 120 గ్రామాల గిరిజన ప్రజలు తమ ఇళ్లు, లక్ష ఎకరాల పంట పొలాలు త్యాగం చేసినా వారికి పరిహారం ఇవ్వటంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని సిపిఎం గుంటూరు, పల్నాడు జిల్లా కార్యదర్శులు పాశం రామారావు, గుంటూరు విజరుకుమార్‌ విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని కోరుతూ చేపట్టిన పాదయాత్రకు సంఘీబావంగా గుంటూరు పల్నాడు జిల్లాల్లో సోమవారం విరాళాల సేకరణ చేపట్టారు. ఇందులో భాగంగా గుంటూరులోని బ్రాడీపేట, అరండల్‌పేట, శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో ప్రజలు, షాపుల నుంచి విరాళాలను సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సేకరించారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని మున్సిపల్‌ కార్యాలయం నుండి పల్నాడు రోడ్డులో కొన్ని దుకాణాల్లో విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా రామారావు, విజరుకుమార్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందుగా నిర్వాసితులు అవుతున్న ప్రజానీకానికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లించాలని చట్టంలో స్పష్టంగా ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఎలాంటి సహాయమూ చేయలేదన్నారు. గత ఆగస్టులో సంభవించిన వరదల కారణంగా పోలవరం నిర్వాసిత గిరిజన ప్రజానీకం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరుతూ నిర్వాసితులు సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహిస్తూ విజయవాడకు చేరుకుంటారని, ఆ సందర్భంగా విజయవాడ ధర్నాచౌక్‌లో బహిరంగ సభ జరుగుతుందని, సభలో సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పాల్గొంటున్నారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం తమ సొంత గూడును, పొలాలను త్యాగం చేసిన గిరిజనులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. గుంటూరులో సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌, నాయకులు ఎం.ఎ.చిష్టి, బి.ముత్యాలరావు, కె.శ్రీనివాసరావు, ఆది నికల్సన్‌, షేక్‌ ఖాసిం షహీద్‌, సాంబశివరావు, షేక్‌ ఖాశీం వలి, ఎ.కల్యాణి, నరసరావుపేటలో కె.హనుమంతరెడ్డి, జి.మల్లేశ్వరి, ఎస్‌.ఆంజనేయ నాయక్‌, షేక్‌ సిలార్‌ మసూద్‌, కె.సాయికుమార్‌, రాజు, షేక్‌ మస్తాన్‌వలి, ఎం.ఆంజనేయులు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌లో సిపిఎం నాయకులు విరాళాలు సేకరించారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులను మోసం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలన్నారు. వందలాది మంది పాల్గొంటున్న ఈ పాదయాత్రకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. నాయకులు వై.కేశవరావు, జొన్నా శివశంకరరావు, డి.శ్రీనివాసకుమారి, బి.వెంకటేశ్వర్లు, ఎస్‌.ముత్యాలరావు, లక్ష్మణరావు, సిహెచ్‌.శ్రీరామ్‌, కె.సాంబశివరావు, ఎమ్‌డి బాబ్జీ, బి.కృష్ణ, ఎల్‌.ఆచారి, కె.మేరి, కె.వెంకటయ్య పాల్గొన్నారు. కుంచనపల్లి ప్రాతూరు రోడ్డు వద్ద సిపిఎం తాడేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమం సిపిఎం మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగింది. సీనియర్‌ నాయకులు జొన్న శివశంకరరావు మాట్లాడారు. నాయకులు ఎ.రంగారావు, పి.కృష్ణ, ఎ.రామారావు, ఎం.పాములు, పి.సుబ్బారావు, కె.స్వాతి, ఎస్‌.రవి కిషోర్‌, వి.బెనర్జీ, హనుమంతరావు, కె.శ్రీనివాసరావు, జి.శంకర్రావు, బి.ఏలియా పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం చిలువూరులో సిపిఎం ఆధ్వర్యంలో నిధి వసూలు చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు మాట్లాడారు. మండల కార్యదర్శి జెట్టి బాలరాజు నాయకులు ఎం.నాగమల్లేశ్వరరావు, జి.బాలచంద్రుడు, ఎం.కోటేశ్వరరావు, కె.దావీదు పాల్గొన్నారు.