Jun 06,2023 00:09

మాట్లాడుతున్న సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య

ప్రజాశక్తి- కూనవరం
పోలవరం ప్రాజెక్ట్‌ వల్ల నష్టపోతున్న నిర్వాసితులకు తక్షణమే పునరావాసం కల్పించి, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అందజేయాలని సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. మండలంలోని రేపాక గ్రామంలో సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను పరిశీలించడానికి వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ముందు ప్రాజెక్టు ముంపు ప్రజలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, ముంపులో వున్న భూములకు సంబంధించిన నష్టపరిహారం చెల్లించాలని, నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఎం.నాగమ్మ, మాజీ సర్పంచ్‌ బొజ్జి, జోగయ్య నర్సింహ రావు తదతరులు పాల్గొన్నారు.