Jul 24,2021 22:34

ప్రజాశక్తి-అమరావతి : చట్ట ప్రకారం పునరావాసం కల్పించకుండా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ఖాళీ చేయించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జయసూర్యలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వాసితులకు పునరావాసం ఇతర చర్యలు తీసుకోకుండానే గ్రామాల నుంచి అధికారులు ఖాళీ చేయిస్తున్నారని పేర్కొంటూ స్వచ్ఛంద సంస్థ 'శక్తి' డైరెక్టర్‌ డాక్టర్‌ శివరామకఅష్ణ దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా నిర్వాసితుల హక్కుల పరిరక్షణ, పునరావాసం ప్యాకేజీ అమలు, ప్యాకేజీ పర్యవేక్షణకు తీసుకున్న చర్యలను వివరించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని ధర్మాసనం ఆదేశించింది. నిర్వాసితుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, పోలవరం కాఫర్‌ డ్యాంలో నీటిని నిల్వ చేసి నిర్వాసితుల గ్రామాలు ముంపునకు గురయ్యేలా చేస్తున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది కేఎస్‌ మూర్తి హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నిర్వాసితులు నానాకష్టాలు పడుతున్నారని, బాధిత గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆయన చెప్పారు. పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు లేవని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందని ధర్యాసనం దృష్టికి తీసుకువచ్చారు.తదుపరి విచారణను ఆగస్టు 23కి వాయిదా పడింది.