Nov 27,2022 21:21

ప్రజాశక్తి - కుక్కునూరు
         పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆదివారం చల్లవారిగూడెంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ద్వారా ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వలన 41.15వ కాంటూర్‌లోని మొదటి విడత ముంపునకు గురవుతున్న కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని నిర్వాసితులు తమకు ఇళ్లు వద్దని స్థలాలు కావాలని దరఖాస్తులు పెట్టుకున్న కుకునూరు మండలంలో 53, ఎ బ్లాక్‌కు చెందిన 49మంది, కివ్వాక4, వేలేరుపాడులో167, శ్రీరాంపురం120, కోయిదా47 మొత్తం220 కుటుంబాలకు జంగారెడ్డిగూడెం పరిధిలోని చల్లవారిగూడెంలో ఒక్కొక్కరికి ఐదు సెంట్ల ఇంటి స్థలాల పట్టా ధృపత్రాలను అందించినట్లు తెలిపారు. ఇళ్లు కావాలనుకున్న వారికి ఇంటి నిర్మాణం శరవేగంగా జరుపుతున్నట్లు తెలిపారు. నిర్వాసితులందరికీ త్వరలోనే పునరావాస పరిహారం చెల్లించి కాలనీలకు తరలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుక్కునూరు సర్పంచి రావు మీనా వినోద్‌, గ్రామస్తులు ఎం. వెంకన్నబాబు, కె.కృష్ణంరాజు, సుర్ల. అనిల్‌, రాము, చంటి పాల్గొన్నారు.