Nov 27,2022 00:16

సర్వే వివరాలు పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

సబ్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌
ప్రజాశక్తి-విఆర్‌.పురం

మండలంలోని పోలవరం నిర్వాసితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరిగిందని సబ్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ అన్నారు. రామవరం, రామవరం పాడు గ్రామాల సమస్యలపై కలెక్టర్‌ చర్చించి సర్వే వివరాలు తెలియజేస్తామని వివరించారు. శనివారం ఆయన ఆయా గ్రామాల్లో పర్యటించారు. గ్రామంలోని సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రభుత్వం ద్వారా లభించే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. సర్వే వేసిన బౌన్డరీలను పరిశీలించారు. ఈ పర్యటనలో ఎంపిపి కారం లక్ష్మీ, సిపిఎం జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, స్థానిక ప్రజలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.