మాచర్ల: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు శాపం కాకుండా అండగా నిలుద్దామని సిఐటియు మాచర్ల జిల్లా నాయకులు ఆంజనేయులు నాయక్ అన్నారు. గత కొన్నిరోజులుగా పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో పోలవరం పోరుయాత్ర జరుగుతోందని, అన్నారు. ఎక్కడ ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టు నిర్మాణం పైన, అది ఎన్ని ఎకరాలకు నీరు అందిస్తుంది అనే దానిపైనే చర్చ జరుగుతుంది తప్ప ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం త్యాగం చేసిన నిర్వాసితులను ప్రభుత్వాలు గుర్తుంచుకోవడం లేదని విమర్శించారు. పోరుయాత్రకు తోచిన సహాయం చేసి వారికి అండగా నిలుద్దామని, దాని కోసం విరాళాల సేక రణ జరుగుతోందని చెప్పారు.ఈ పోరు యాత్రకు అందరూ మద్దతు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటి యు నాయకులు బండ్ల మహేష్ వై.సురేష్, వెంకటరత్నం, వెంకట్రావు పాల్గొన్నారు. చిలకలూరిపేట: పోలవరం నిర్వాసితుల మహా పాదయాత్రకు సంఘీ భావంగా చిలకలూరిపేటలో శనివారం నిధులు సేకరించి నట్లు మండల సిఐటియు కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు చెప్పారు. స్థానిక పండరీపురం సిఐటి యు కార్యాలయం వద్ద నుంచి ఎన్. ఆర్.టి. సెంటర్ మీదుగా చౌత్రా సెం టర్,చలి వేంద్రం బజార్, బంగా రపు కొట్ల బజారు మీదుగా కళామందిర్ సెంటర్ వరకు సంఘీ భావ నిధుల కోసం తిరిగినట్లు చెప్పారు. ఈ నిధికి మొత్తం రూ.3,570 వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఎం.విల్సన్, కె. రోశయ్య, పి.రాజు,చిన్న,శ్రీను, నాగే శ్వరరావు,జవహర్ బాబు పాల్గొన్నారు. పిడుగురాళ్ల: పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ జరుగుతున్న పాదయాత్రకు సంఘీభావంగా పిడుగురాళ్ల పట్నంలోని సిఐటియు ఆధ్వర్యంలో సంఘీభావ నిధిని వసూలు కార్యక్రమం శనివారం నిర్వహించారు .ఈ సందర్భంగా సిఐటియ మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. మున్సిపల్ వర్కర్స్ కె . సీతారామయ్య, బి.రామారావు, ఎం.ప్రతాపు, కె. కొండలు, వి. కోటేశ్వరరావు,డి.వెంకటేశ్వర్లు,సిహెచ్ పద్మ ,రతమ్మ తదితరులు పాల్గొన్నారు.










