Jul 02,2023 00:02

పాదయాత్రలో పాల్గొన్న గంగరాజు

ప్రజాశక్తి -అనంతగిరి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు నేతృత్వంలో సాగుతున్న పోలవరం పాదయాత్రలో అల్లూరి సీతారామ రాజు జిల్లా సీపీఎం నేత, జెడ్‌పిటిసి దీసారి గంగరాజు, సూడిపల్లి కొండలరావులు పాల్గొని సంఘీభావం తెలిపారు. పాదయాత్ర సందర్భంగా అనంతగిరి జడ్పీటీసీ దీసరి గంగరాజు మాట్లాడుతూ, గిరిజన చట్టాలు, హక్కులు ఉల్లంఘించి నిర్వాసిత ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయం పై ఆదివాసులందరు ఐక్య పోరాటాలు నిర్వహించాలన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించిన విధంగా పదిన్నర లక్షల పరిహారం 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికీ ఇవ్వాలన్నారు. ముంపు ప్రాంతంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ప్రతీ ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించాలన్నారు.పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట మండల పరిషత్‌ వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు అనంతగిరి యువజన నాయకులు నరాజి సురేష్‌ పాల్గొన్నారు.