ప్రజాశక్తి - ఎటపాక
2022 జులై, ఆగస్టు నెలల్లో వచ్చిన గోదావరి వరదలకు ముంపునకు గురైన మండలంలోని గన్నవరం, కాపు గొంపల్లి, రచ్చగొంపల్లి, కృష్ణవరం గ్రామాలను పోలవరం ముంపు జాబితాలో చేర్చాలని సిపిఐ ఆధ్వర్యంలో ఎటపాక తహశీల్దార్‌కి వినతి పత్రం అందించారు. గురువారం గన్నవరంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో తహసీల్దార్‌కి వినతి అందించారు. ఈ సందర్బంగా సిపిఐ నాయకులు మాట్లాడుతుతూ గతేడాది వరదల్లో ఆయా గ్రామాలు ముంపునకు గురవ్వడంతో ఇండ్లు, పంట పొలాలు మునిగి పోయాయాని తెలిపారు. ప్రతి ఏటా గోదావరి వరదల వల్ల ఇదే దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం పంచాయితీ, కృష్ణవరం గ్రామాలను పోలవరం ముంపు జాబితాలో చేర్చి, భూప్యాకేజీ, ఇండ్ల ప్యాకేజీ ఇచ్చి పునరావాసం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం భద్రమ్మ, ఎంపిటిసి కంటె రాజు, సిపిఐ మండల కార్యదర్శి ఎలుశాల నాగరాజు, సీనియర్ నాయకులు వల్లభనేని సత్యనారాయణ, పూస రాఘవలు, మైపా రోశయ్య తదితరులు పాల్గొన్నారు.










