Sep 20,2023 21:09

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : జిల్లాలో పోలింగ్‌ స్టేషన్ల సమస్యలు ఉంటే వెంటనే తెలియ జేయాలని కలెక్టర్‌ గిరీష రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఓటర్ల జాబితా పరిశీలనపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ గిరీష పిఎస్‌ సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్‌ స్టేషన్ల చేర్పులు మార్పులు, తదితర సమస్యలపై వెంటనే తమకు తెలియజే యాలన్నారు. ఓటరు జాబితా ఇంటింటి పరిశీలన దాదాపు పూర్తి అయిం దన్నారు. డెత్‌, షిఫ్టెడ్‌, రిపీటెడ్‌ ఓట్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించడం జరిగిందన్నారు. జిల్లాలో ఓటర్‌ జాబితాకు సంబంధించి అందిన క్లెయిమ్స్‌ అండ్‌ అబ్జెక్షన్స్‌ పక్కాగా పరిశీలన చేస్తున్నామన్నారు. కావున రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ తప్పులు లేని స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పనకు క షి చేయాలన్నారు. జిల్లాలో డిలీట్‌ అయిన ఓట్లను బిఎల్వోలు పోలింగ్‌ స్టేషన్‌ వారీగా పరిశీలించామన్నారు. జంక్‌ ఓటర్లను పరిశీలిస్తున్నామని ఇంకా ఎక్కడైనా ఓకే డోర్‌ నెంబర్లో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉంటే తమ దష్టికి తీసుకురా వాలన్నారు. జిల్లాలో మొత్తం1577 పోలింగ్‌ స్టేషన్లు, 1577 బిఎల్‌ఒలు ఉన్నారన్నారు. ఓటర్లకు సంబంధించి 668552 మంది పురుషులు, 685071 మహిళలు,136 ఇతరులు మొత్తం1353759 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహాయ సహకారాలు అందించి అన్నమయ్య నూతన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం నియోజకవర్గాల వారీగా వివిధ అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్‌ చర్చించారు.కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి, రాజంపేట, మదనపల్లి ఆర్‌డిఒలు రంగస్వామి, రామకృష్ణారెడ్డి, మురళి, తహశీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.