పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
ప్రజాశక్తి - నందికొట్కూరు
పట్టణంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాల నందు టిడిపి నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మండ్రా శివానందరెడ్డి రాకతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సదరు టిడిపి నేత మాండ్ర శివానందరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రమునకు వెళ్లేక్రమంలో ఆయన వెంట వస్తున్న అనుచరులను పట్టణ ఎస్సై రమణ నిలుపుదల చేసి, టిడిపి శివానందరెడ్డి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ మురళీకృష్ణారెడ్డి, కౌన్సిలర్ నాయబ్, కౌన్సిలర్ జనార్దన్ గౌడ్, ఉపసర్పంచ్ సురేష్ ఎలా వెళ్తారు? అంటూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే విధి నిర్వహిస్తున్న ఎస్సై ఎన్వి రమణ తన చాకచక్యంతో ఆందోళన చేస్తున్న వారిని దీనితో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రమణ, సీఐ విజయభాస్కర్ పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా తగిన చర్యలు చేపట్టారు.










