Jul 21,2023 22:56

సూచనలు చేస్తున్న జెసి నవీన్‌

ప్రజాశక్తి - పాతపట్నం: మండలంలోని కొరసవాడలో పోలింగ్‌ కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ శుక్రవారం పరిశీలించారు. బిఎల్‌ఒలు ఇంటింటికీ వెళ్లి డోర్‌ టు డోర్‌ వెరిఫికేషన్‌ చేసి 18 ఏళ్లు నిండిన వారిని ఓటరుగా చేర్చాలని ఆదేశించారు. చనిపోయిన, వివాహమై వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారిని తొలగించాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు, ఇంటిపేరు, చిరునామలో తప్పులు ఉంటే సరిచేయించాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ కె.రవిచంద్ర, డిప్యూటీ తహశీల్దార్‌ ప్రసాదరావు, ఎన్నికల డిటి శైలజ తదితరులు పాల్గొన్నారు.