Sep 14,2023 22:27

నకరికల్లు: పోలింగ్‌ కేంద్రాలు మార్పులు, చేర్పులపై స్థానిక తహ శీల్దార్‌ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతి నిధు లతో గురువారం సమావేశం నిర్వహించారు. తహ శీల్దార్‌ కె.నగేష్‌ మాట్లాడుతూ మండలంలోని రూపిన గుంట్లలో 212, 214 పోలింగ్‌ కేంద్రాలు, చాగల్లులోని 200వ పోలింగ్‌ కేంద్రాల భవనాలు శిధిలావస్థకు చేరు కోవడంతో వాటిని కూల్చివేసి కొత్తగా నిర్మాణం పూర్తయిన భవనాల్లో కొనసాగిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్‌ కేంద్రాలపై అభ్యం తరాలు ఉంటే స్వీకరిస్తామన్నారు.