పోలింగ్ కేంద్రాలలో తనిఖీ ధృశ్యం
ప్రజాశక్తి-నెల్లూరు :నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాలను కమిషనర్ వికాస్ మర్మత్ గురువారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. స్థానిక వెంకటేశ్వర పురం గాంధీ గిరిజన కాలనీ, ఇసుక డొంక, రంగనాయకుల పేట తదితర ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ కేంద్రాలను కమిషనర్ తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు, ఇతర సదుపా యాలు కల్పించాలని ఎన్నికల అధికారులకు సూచించారు. నగర పాలక సంస్థ సిటీ ప్లానర్ దేవీ కుమారి, ఇతర అధికారులు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.










