Feb 27,2023 23:59

ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటు

ప్రజాశక్తి -కోటవురట్ల: వచ్చే నెల 13న జరగనున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన 179 పోలింగ్‌ కేంద్రాన్ని సోమవారం తహసిల్దార్‌ జానకమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర్‌, రూట్‌ ఆఫీసర్‌ నరసింహారావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల, గ్రామ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, గ్రామ రెవెన్యూ అధికారి అప్పారావు పాల్గొన్నారు.
గొలుగొండ:ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గొలుగొండ యుపి స్కూల్‌లో ఏర్పాటు చేసే పోలింగ్‌ బూత్‌ను తహశీల్దార్‌ జి.ఆనందరావు పరిశీలించారు. గొలుగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసే పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 165ను అన్ని విధాలుగా ఎన్నికలకు సిద్ధం చేసేందుకు పరిశీలించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండల కేంద్రంలో ఎప్పటిలాగే ప్రభుత్వం గుర్తించిన భవనంలోనే బూత్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లకు అనువుగా ఉండే విధంగా తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం ఉండేవిధంగా సిద్ధం చేస్తున్నామన్నారు. ఆయన వెంట ఆర్‌ఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.