Nov 05,2023 22:13

ప్రజాశక్తి - యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెండు రోజులపాటు జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్నిఆదివారం పలువురు అధికారులు ఆయా పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఉండ్రాజవరం మండ లంలో ప్రత్యేక ఓటర్‌ నమోదు కేంద్రాలను అధికారులు పరిశీలించారు. స్థానిక పోలింగ్‌ స్టేషన్‌లో ఎలక్ట్రోలర్‌ అధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ భూసేకరణ ఎం. ఝాన్సీ రాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్‌ జాబితాలో తప్పులు ఏమైనా ఉంటే సరిచేయడంతోపాటు, కొత్తగా ఓటర్లగా చేరే వారి కోసం ఈ ప్రత్యేక ఓటరు నమోదు కారక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కె.సావరం, పాలంగి, మోర్త, దమ్మెన్ను గ్రామాల్లో తహశీల్దార్‌ జి.కనకరాజు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్‌ కె.పద్మావతి, ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో బిఎల్‌ఒలు పాల్గొ న్నారు. పెరవలి మండలంలోని కాపవరం, కాకరపర్రు, తీపర్రు గ్రామాల్లో పోలింగ్‌ స్టేషన్లను స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ భూసేకరణ ఎం. ఝాన్సీ రాణి సందర్శించారు. బిఎల్‌ఒలకు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులపై ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎల్‌ఒలు సూరిబాబు రామకృష్ణ సంజరు తదితరులు పాల్గొన్నారు. నల్లజర్ల మండలంలో 66 పోలింగు కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నల్లజర్ల, పోతవరం గ్రామాల్లోని పోలింగ్‌ స్టేషన్లను స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం వెంకట సుధాకర్‌(ఎల్‌ఎ), తహశీల్దార్‌ వి.కిషోర్‌ కుమార్‌ పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం సాయంత్రం ఐదు గంటలకు మండలంలోని మొత్తం 66 పోలింగు కేంద్రాల్లో 329. మంది. కొత్తగా ఓటుకు దరఖాస్తు చేసుకోగా, మృతి చెందిన, శాశ్వత గ్రామాంతరంకు సంబంధించి 82 మంది, సవరణ కొరకు 182. మంది దరఖాస్తు చేసుకున్నారని, రెండు రోజుల్లో మండల వ్యాప్తంగా 593 దరఖాస్తులు అందినట్లు తహశీల్దార్‌ కిషోర్‌కుమార్‌ తెలిపారు. చాగల్లు మండలంలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్లు నమోదు కార్యక్రమం జరిగింది. సూపర్‌వైజర్లు కె.రాజ్యలక్ష్మి, బి.రాంప్రసాద్‌ పర్యవేక్షణలో ఫారం 6లో 264, ఫారం 7లో 62, ఫారం 8లో 192 మంది ధరఖాస్తులు వచ్చాయి.