Aug 13,2023 22:29

ప్రజాశక్తి - ముసునూరు
     ఈనెల 19వ తేదీన జరగనున్న బై ఎలక్షన్స్‌ దృష్టిలో పెట్టుకుని ముసునూరు మండలంలోని పోలింగ్‌ కేంద్రాలను నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌ పరిశీలించారు. ఆదివారం మండలంలోని చిల్లబోయినపల్లి గ్రామంలోని 107, 108 పోలింగ్‌ కేంద్రాలను తహశీల్దార్‌ దాసరి సుధా, ఇఒపిఆర్‌డి బసవరాజు సత్యనారాయణ, పోలింగ్‌ సూపర్‌ వైజర్లు, బిఎల్‌ఒల ఆధ్వర్యంలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి, వారికి పలు సూచనలు, సలహాలు చేశారు.